TEJA NEWS

రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా నే రోడ్డు ప్రమాదాలను నివారించగలం:జిల్లా ఎస్పీ రితిరాజ్

గద్వాల జనవరి 23 :-రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా నే రోడ్డు ప్రమాదాలను నివారించగలం అని జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రం లోని రోడ్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని రోడ్డు భద్రతా నియమాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా మూడు రోజుల పాటు హెల్మెట్ ధరించిన వారిని అభినందిస్తూ మూడు రోజుల తరువాత హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించడం తో పాటు జరిమానాలు చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్ల అదికారులు తమ పరిధి లోని రోడ్ల పై వెళ్లే వాహనదారులు వారి భద్రతా కోసం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ హెల్మెట్ ధరించిన వాహన దారులకు పుష్పాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వాహన దారుడు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పని సరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, బయటకు వెళ్ళిన తన కోసం కుటుంబ సభ్యులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటరన్న విషయాన్ని వాహన దారులు గుర్తించాలని, అనుకొని ప్రమాదాల వల్ల కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని కావున వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అందులో హెల్మెట్, షీట్ బెల్ట్ తప్పని సరి ధరించాలని , అతి వేగం, ర్యాస్ డ్రైవింగ్, మద్యం త్రాగి డ్రైవింగ్ చేయటం, మొబైల్స్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయటం వంటివి చేయవద్దని పోలీస్ అదికారులు వాహనదారులకు సూచించారు.


TEJA NEWS