TEJA NEWS

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్బంగా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని రాజరంపల్లి లో జరుగు బహిరంగ సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్, హెలిప్యాడ్, వి ఐ పి పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు సభా స్థలికి వచ్చి వెళ్లే దారులు జనరల్ పార్కింగ్ ప్రదేశాలను ను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

జిల్లా ఎస్పీ వెంటవ ఏఎస్పి శివం ఉపాధ్యాయ, డిఎస్పి రఘు చంధర్,SB ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు,సి.ఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్.ఐ ఉమా సాగర్ ఉన్నారు.


TEJA NEWS