డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు

TEJA NEWS

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు: చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశం
ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
లైసెన్సు లేని నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్
శంకర్‌పల్లి:
వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశం అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో వాహనాలకు నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ… లైసెన్స్ లేకుండా వాహనాలను నడపొద్దు అన్నారు. నెంబర్ ప్లేట్ సరిగా కనబడకుండా టాపరింగ్ చేయడం చట్టరీత్య నేరమన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని అలా ఇచ్చిన ఎడల యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ సీటు బెల్ట్ ధరించి వాహనాల నడపాలని సూచించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Similar Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి