TEJA NEWS

శీనన్న జన్మదినోత్సవం రోజున సేవా కార్యక్రమాలు చేపట్టండి…!

  • ఉమ్మడి జిల్లాల్లోని పొంగులేటి అభిమానులకు దయాకర్ రెడ్డి పిలుపు

ఉమ్మడి ఖమ్మం

ఉమ్మడి ఖమ్మంజిల్లా ముద్దుబిడ్డ… బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి… తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శీనన్న జన్మదినోత్సవం ఈనెల 28న సోమవారం పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మంజిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలను చేపట్టాలని పొంగులేటి అభిమానులకు క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, అనాథ, వృద్ధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు, పేద విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా ఉన్న పొంగులేటి అభిమానులందరూ ఆయా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలని దయాకర్ రెడ్డి కోరారు.


TEJA NEWS