TEJA NEWS

చదువుకోవాలని ఉందా..?

చర్లపల్లిలో జోరువానలో కూలీగా మారిన బాలికను చూసి ఆగిన బండి సంజయ్

కరీంనగర్ వెంటనే హాస్టల్ లో చేర్పించి చదివిస్తానని హామీ..
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లిలో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభంచి తిరిగి వెళుతుండగా. ఈ గ్రామ శివారులో పొలం పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలు జోరు వానలోనే రోడ్డుపైనే భోజనాలను చేయడాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ కూలీల గుంపులో మైనర్ బాలికను చూసి ఏం తల్లి..పనికి వెళుతున్నవ్. చదువు ఇష్టం లేదా?అని ప్రశ్నించడంతోపాటు కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. తన పేరు బోళ్ల అక్షయ అని, టెన్త్ క్లాస్ పాసైనప్పటికీ ఆర్దిక పరిస్థితి బాగోలేక కూలీ పనులకు వెళుతున్నానని బదులిచ్చారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో వెంటనే అక్కడున్న పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి పిలిచి బాలిక వివరాలు తీసుకుని వెంటనే కాలేజీలో చదివించడంతోపాటు ఆసక్తి ఉంటే హాస్టల్ లో చేర్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా అక్షయ బండి సంజయ్ కు థ్యాంక్స్ చెప్పారు.


TEJA NEWS