TEJA NEWS

పరోక్షంగా వద్దు.. ప్రత్యక్షంగా విచారించండి: కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా కీలక విషయాలను రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేశారు. తనను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపర్చవద్దని.. కేసు విచారణ వేళ తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపర్చాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కవిత తిహాడ్‌ జైలులో ఉన్నారు. ఈ నెల 7వ తేదీతో ఆమె జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది. అయితే కవిత దరఖాస్తుపై సమాధానం చెప్పాలని దర్యాప్తు సంస్థలకు కోర్టు నోటీసులిచ్చింది.


TEJA NEWS