ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గడప గడపకు చేరేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో చేపట్టిన విప్లవాత్మక పధకాల అమలు, కార్యక్రమాలను రాష్ట్రంలోని ప్రతి గడప గడపకు చెరవేసేలా విస్తృత స్థాయిలో కార్యక్రమాలను చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని HAL కాలనీలోని సిటీ ప్యాలెస్ లో శనివారం *ప్రజపాలన విజయోత్సవ సమావేశంలో కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి , నియోజకవర్గ ఇన్ఛార్ హనుమంత రెడ్డి , పిసిసి ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి , కంటెస్టడ్ కార్పోరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ , రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిఆర్ లక్ష్మి , జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరు ప్రభాకర్ రెడ్డి , ఐ ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ , జిల్లా ఉపాధ్యక్షులు డి శ్రావణ్ కుమార్, జి ఐలయ్య గౌడ్, సిహెచ్ బుచ్చిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, మాజి కార్పొరేటర్ పాలకృష్ణ, ఎక్స్ కౌన్సిలర్ బొబ్బా రంగారావు, మోతే శ్రీనివాస్ యాదవ్, జయరాం, ఓరుగంటి కృష్ణ గౌడ్ రషీద్ భాయ్ జేమ్స్ సతీష్ మధు విజయ గుప్తా తోఫిక్ జహంగీర్ డాన్ శీను గంగారం కె శంకర్ బలరాం గుబ్బల రమణ శ్రీనివాస్ రంగనాథ్ మరియు డివిజన్ అధ్యక్షులు నాయక్ పండరి శ్రీధర్ రెడ్డి రాధాకృష్ణశివకుమార్ గణేష్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.