TEJA NEWS

భారతదేశ ప్రజల స్పూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్.

భారతదేశ ప్రజల స్పూర్తి ప్రదాత భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలను తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ సమానత్వం, సౌభ్రాతృత్వం, అందరికీ సమాన న్యాయం అనే అంశాలతో కూడిన భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మానవతావాది అంబేడ్కర్ అన్నారు. మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా సమాన హక్కులు కల్పించారని అన్నారు. ఆయన రాజ్యాంగ స్ఫూర్తి తో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ అంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, భారత ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు అన్నారు. ఈ జయంతి వేడుకల్లో తుడా ఇంచార్జి సెక్రెటరీ, సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణా రెడ్డి, ఈఈ రవీంద్ర, ప్లానింగ్ ఆఫీసర్ దేవికుమారి, ఉద్యానవన శాఖ అధికారి మాలతి, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.