TEJA NEWS

ఓయూలోమెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన : డాక్టర్ లోకేష్ యాదవ్

టి పి సి సి రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ మెంబర్ & స్ట్రాటజీ కమిటీ మెంబర్ డాక్టర్ లోకేష్ యాదవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగులు, యువకుల ఆధ్వర్యంలో తల సేమియాతో, రక్తహీనతతో బాధపడే వారికోసం భారీ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి డాక్టర్స్, టీం వారితో రక్త సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు….
ఎంతోమంది విద్యార్థులు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ లోకేష్ యాదవ్ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థి నాయకులు, ఘనంగా నిర్వహించారు…
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వికాస్, శ్రీనివాస్ యాదవ్, రామచంద్ర యాదవ్, లెనిన్, శ్రావణ్, వినోద్, మనోహర్, శంకర్ యాదవ్, అనిల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS