TEJA NEWS

మత్తు పదార్థాల నివారణలో అందరిదీ బాధ్యతే

** తిరుపతిలో ఈగిల్ రేంజ్ ఐజీ రవికృష్ణ

తిరుపతి: నగరంలోని రుయా హాస్పిటల్ సమీపంలో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని ఈగిల్ రేంజ్ ఐజీ ఆర్.కె.రవికృష్ణ సందర్శించారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడుతో కలసి ఐజీ సందర్శించి కేంద్రంలోని సదుపాయాలు, వైద్య చికిత్స, కౌన్సెలింగ్ విధానాలను సమీక్షించారు.
ఐజీ మాట్లాడుతూ.
“మత్తు వ్యసనం వ్యక్తిగత సమస్య కాదు, ఇది సామాజిక సమస్య. బాధితులను సాధారణ జీవితంలోకి తీసుకురావడం ఒక పవిత్ర సేవ. ఈ కేంద్రాలు మరింత సమగ్రంగా సేవలు అందించాలనీ, ప్రభుత్వం కూడా పర్యవేక్షణ కొనసాగిస్తోందని” పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.
“మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు, పునరావాస చర్యలను నిరంతరం చేపడుతోంది. యువత భవిష్యత్తు సుస్థిరంగా ఉండాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి” అని సూచించారు.
“మత్తు వదలండి – జీవితాన్ని గెలవండి ” అని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రుయా సూపరిటెండెంట్ డాక్టర్ జె. రాధ, డాక్టర్ హరికృష్ణ, శాంతి భద్రతల విభాగం అడిషనల్ ఎస్పీ రవిమనోహర చారి, ఈగల్ టీం అధికారులు, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ చారి, సిఐలు, డ్రగ్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ హరిప్రసాద్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రీతూ, మానసిక విభాగము-మత్తు వ్యసన నిర్మూలన కేంద్రం మానసిక విభాగాధిపతి డాక్టర్ పద్మావతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.