పట్టణంలోని 25వ వార్డు జాగుపాలెం దిగువ యానాది కాలనీ లో 40 కుటుంబాలకు జనసేన అండ
నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ చేతుల మీదుగా
రూ. 20 వేల విలువైన కూరగాయలు, దుప్పట్లు పంపిణీ
చిలకలూరిపేట పట్టణంలోని జాగుపాలెం ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 40 కుటుంబాలకు నియోజకవర్గ జనసేన నాయకులు పెద్ద మనసుతో అండగా నిలిచారు. నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ చేతుల మీదుగా రూ. 20,000 విలువ గల కూరగాయలు మరియు దుప్పట్లను వారికి పంపిణీ చేశారు.
శీతాకాలం మరియు నిత్యావసరాల కొరతను దృష్టిలో ఉంచుకుని, చరణ్ తేజ స్వయంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారికి దుప్పట్లు, కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ మరియు ఇతర జన సైనికులు కూడా పాల్గొన్నారు.సేవే లక్ష్యంగా జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నేతలు ఈ సందర్భంగా తెలియజేశారు. నిరుపేద కుటుంబాలకు చేసిన ఈ సహాయాన్ని జాగుపాలెం వాసులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో 25 వార్డు కౌన్సిలర్ తోట నాగలక్ష్మి, సురేష్, జన సైనికులు, వీర మహిళలు తదితరులు ఉన్నారు.
