TEJA NEWS

ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో రోజుకో విద్యార్థి మృతి

రాష్ట్రాన్ని ఏంది ఉద్ధరించారని విజయోత్సవాలోరేవంత్ రెడ్డి చెప్పాలని ఎద్దేవా…………….

యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు
సేవెళ్ల మహేందర్

వనపర్తి
జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కృష్ణ గార్డెన్స్ లో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఏ.రాజశేఖర్ గౌడ్ అధ్యక్షతన క్రియాశీల సభ్యత్వ నమోదు మరియు గద్వాల వనపర్తి నాగర్ కర్నూల్ జిల్లా బీజేవైఎం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ల మహేందర్ పాల్గొని మాట్లాడుతూ బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని రాష్ట్రంలో 36 లక్షల సభ్యత్వాలు మరియు వనపర్తి జిల్లాలో రాష్ట్ర పార్టీ లక్ష్యానికి 80 శాతం పూర్తి కావడం సంతోషకరమని వనపర్తి జిల్లాలో యువమోర్చా జిల్లా మరియు మండల కమిటీలు కూడా సభ్యత్వ నమోదులో తమకు సూచించిన లక్ష్యం సాధించుటకు తీవ్రంగా శ్రమించారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న అతి ముఖ్యమైన విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం విద్యాశాఖ పై నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఏ మంచి నిర్ణయం తీసుకున్న యువమోర్చా మద్దతుగా ఉంటుందని అదే సమయంలో ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీసి వివక్షకు గురి చేస్తే దానికి రెట్టింపు స్థాయిలో పోరాటం సాగిస్తుందని ఆదిలాబాద్ నుండి పాలమూరు వరకు విద్యార్థుల శ్రేయస్సు కొరకు ఒకే రకమైన ప్రోత్సాహం అవసరమని విద్యాశాఖకు మంత్రి లేకపోవడం చేత గురుకుల పాఠశాలలో రోజు విద్యార్థులు మరణ వార్తలు చూసి వారి తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారని బాసర త్రిబుల్ ఐటీ పాలమాకుల జగిత్యాల మెదక్ నేడు వనపర్తి జిల్లా మదనాపురం లో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం విద్యాశాఖ పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని వెంటనే గురుకుల పాఠశాలలో నోడల్ అధికారుల నియామకం మరియు స్కూళ్లలో హడ్ హాక్ కమిటీలు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలన్నారు.

6 మోసాలు 66 అబద్దాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రాష్ట్రంలో ఉద్ధరించారని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో ప్రజలు అయోమయంలో పడ్డారని స్కూటీ ల పేరుతో విద్యార్థినులను, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను,మహాలక్ష్మి పేరుతో మహిళలను,ఆసరా పెన్షన్ల పేరుతో వృద్ధులను,వికలాంగులను, రుణమాఫీ రైతు బంధు పేరుతో రైతులను, రైతు కూలీలను, బోనస్ పేరుతో రైతాంగాన్ని, తులం బంగారు పేరుతో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలను మోసం చేశారని 500 కు సిలిండర్ లేదు, 200యూనిట్ల ఉచిత విద్యుత్తు లేదు ఏడాది పూర్తయిన రెండు లక్షల కాదు కదా 20వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా సబండవర్ణాలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ఏదో సాధించినట్లు ఉత్తర కుమార ప్రగల్బాలతో పత్రిక టీవీ ప్రకటనలతో విజయోత్సవాల పేరిట యాత్రలు చేస్తూ తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడని తీవ్రంగా దుయ్యబట్టారు.

కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు డి నారాయణ సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు మంటేపల్లి పురుషోత్తం రెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు బీ శ్రీశైలం యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కదిరే మధు యు మోర్చా రాష్ట్ర కార్యదర్శి మంత్రి సుధీర్ యు మోర్చా జిల్లా ఇన్చార్జి అరవింద్ రెడ్డి యువమోర్చా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ పట్టణ అధ్యక్షులు ఎద్దుల రాజు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS