TEJA NEWS

Due to the negligence of the police, the thefts are rampant in Gadwala

పోలీసుల నిర్లక్ష్యమే తో గద్వాల లో జోరుగా దొంగతనాలు

పోలీసుల అప్రమత్తంగా లేకపోవడంతోనే దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇదే మాదిరిగా దొంగతనాలు జరిగితే ఉద్యమానికి సిద్ధం…

దొంగతనం అయిన ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని వేదన నగర్ నిన్న పట్టపగలు జరిగిన దొంగతనం రాత్రి బాధితులు చూసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉదయం వరకు పోలీసులు రాకపోవడంతో ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు నంద్యాల కు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి దొంగతనం జరిగినట్టు బాధితులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఇంట్లో ఉన్న దాదాపుగా 30 తులాల బంగారం మూడు లక్షల 50 వేలు రూపాయల నగదు దొంగతనం జరిగినది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెంటనే వారి ఇంటికి వెళ్లి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. బాధితులను మాట్లాడండి వారిని పరామర్శించి ఓదార్చారు జరిగినది.

దొంగతనం జరిగిన ఇంటిదగ్గర పోలీస్ అధికారి సి.ఐ
తో ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది పోలీస్ ఏమి చేస్తున్నారు. గద్వాలలో రోజురోజు దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయి ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ నిద్రపోతుంది అని హెచ్చరించారు. వెంటనే ఈ దొంగతనాల పైన చర్యలు తీసుకొని ప్రత్యేకమైన పోలీసులకు నిర్వహించి రాత్రిపూట భద్రత పెంచాలని సూచించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ….

గద్వాల నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రోజురోజు దొంగతనాలు పెరిగిపోయేతున్నాయి. పోలీస్ అధికారులు అప్రమత్తం వల్లనే వారు వివరిస్తున్న తీరు వలనే ఇంత దొంగతనాలు జరుగుతున్నా కూడా పోలీసులు నిద్రపోతున్నారు. ఇప్పటికీ దాదాపుగా రెండు మూడు నెలల నుంచి గద్వాల పట్టణంలో గాని గద్వాల నియోజకవర్గంలో గాని దాదాపుగా 200 వరకు బంగారం దొంగతనం జరిగింది.

గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గద్వాల నియోజకవర్గంలో ఎలాంటి దొంగతనాలు లేకుండా శాంతిభద్రతలు కాపాడుతూ పోలీస్ వ్యవస్థ పనిచేసేది. కానీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రోజురోజు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. రెండు నెలల కింద ఒక ఫంక్షన్ హాల్ లో దాదాపుగా 25 తులాల బంగారం మాయమైనది. అదేవిధంగా ఒక వ్యాపారింట్లో నాలుగు లక్షల రూపాయలు మాయమైనవి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గద్వాల పట్టణమే కాకుండా ధరూర్ మండలంలో గట్టు మండలాలలో కూడా దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి ఇంత జరుగుతున్న ప్రజలు కష్టపడి సంపాదించుకున్న దాచుకున్న రూపాయను దొంగల పాలు అవుతున్నది ప్రజలకు రక్షించలేని రక్షణ భద్రత కల్పించలేని పోలీస్ వ్యవస్థ ఏమి చేస్తుంది ఇంత సమర్థమైన పోలీస్ వ్యవస్థ ఉన్నది అని సూచించారు.


TEJA NEWS