మున్సిపల్ కార్మికుల బకాయి వేతనాలుచెల్లించాలన కార్యాలయం ఎదుట సిఐటియు ధర్నా
వనపర్తి
వనపర్తి మున్సిపల్ కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గురువారం కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చి కార్మికులకు చెక్కులు చూపించే వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజే మున్సిపల్ కార్మికులకు వేతనాలు బ్యాంకులో వేస్తున్నామని అధికారులు హామీ ఇవ్వడంతో ముట్టడి కార్యక్రమం నిలిపివేశారు . అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం. రాజు, సిఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే .సునీత పాల్గొని మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఐదో తేదీ లోపు ఇవ్వాల్సిన వేతనాలు ప్రతినెల ఆలస్యంగా వేతనాలు ఇస్తున్నారని మున్సిపల్ కమిషనర్ మాత్రం ప్రతినెల 1వ తేదీన జీతాలు తీసుకొని మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల 21 వరకైనా ఇవ్వడం లేదని విమర్శించారు. తిండిపెట్టి పని చెప్పండని పెద్ద ఎత్తున కార్మికులు నినాదాలు ఇచ్చారు. వాటర్ వర్కర్స్ కు ఒకసారి శానిటేషన్ వర్కర్స్ కు ఒకసారి విభజించి పాలిస్తున్నారని వేతనాలు వేరువేరు సమయంలో ఇస్తున్నారని విమర్శించారు. అనేక రకాల ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
ప్రతి నెల 5వ తేదీ వరకు పూర్తి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చంద్రయ్య. వాటర్ వర్కర్స్ పట్టణ అధ్యక్షుడు శాంతయ్య పట్టణ కార్యదర్శి నరేష్ గౌడ్ శాడిటేషన్ వర్కర్స్ పట్టణ అధ్యక్షులు లాల్ పట్టణ కార్యదర్శి పి గోపాల్ సీనియర్ నాయకులు బాలు యాదగిరి, కురుమూర్తి, వెంకటమ్మ ,రాణి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.