TEJA NEWS

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఉన్నత పదవులు దక్కుతాయి.

టీ. పీ. సీ. సీ. నూతన ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య ముదిరాజ్ ను సన్మానించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి


వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మత్స్యశాఖ సెల్ అధ్యక్షుడు నందిమల్ల యాదయ్య కు ఇటీవల ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీలను ప్రకటించారు అందులో భాగంగా నందిమల్ల యాదయ్యకు
కాంగ్రెస్ పార్టీ టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానియమితులయ్యారు ,నందిమల్ల యాదయ్య ముదిరాజ్ ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన ఈ కార్యక్రమం సందర్బంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని యాదయ్య ముదిరాజ్ కు సూచించారు. అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాలని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంటన్న యాదవ్, శ్రీరంగాపురం మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు యాదవ్, శ్రీరంగాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, సీనియర్ నాయకులు నందిమల్ల రాము, అబ్దుల్లా, సహదేవుడు, బాలరాజ్ , భాస్కర్, ద్వార పోగు విజయ్ , ఎల్ల స్వామి, విజయ్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.