
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి….. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎత్తం మహేష్ డిమాండ్.
వనపర్తి
వనపర్తి జిల్లాలో ప్రవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యా దోపిడికి గురి చేస్తున్నారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎత్తం మహేష్ ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల్లో టై. బెల్టు. షూస్. ID కార్డులను. పుస్తకాలను అమ్ముతున్నారని వీటిని తక్షణమే నిర్మూలించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయులను మాత్రమే టీచింగ్ చేయాలని నిబంధన ఉన్న ఆ నిబంధనలకు పాత్ర వేసి డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన వారితోనే ప్రైమరీ ఎడ్యుకేషన్ చెపుతున్నారని ఆరోపించారు వనపర్తి పట్టణంలో ఈ సంవత్సరం అనేక పాఠశాలలు కొత్తగా ప్రారంభించారని ప్రారంభించిన పాఠశాలలకు గుర్తింపు లేదన్నారు తక్షణమే జిల్లా అధికారులు గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాలల్లో కనీస వసతులు లేకపోయినా ఫీజులు మాత్రం ఆకాశానంటే విధంగా ఉన్నాయన్నారు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని విద్యా హక్కు చట్టం ప్రకారంగా ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలని డిమాండ్ చేశారు. పై సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఈఓ కార్యాలయం సూపర్డెంట్ పి శ్రీనివాసులు కి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఎత్తం విష్ణు రాజేష్ చంద్రశేఖర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
