
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి-కార్మిక వ్యతిరేక విధానాలపై కలిసికట్టుగా ఉద్యమిద్దాం
కార్మిక నేతల పిలుపు
సిఐటియు అనుబంధ 4వ జిల్లా మహాసభలు విజయవంతం
వనపర్తి
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం 4వ జిల్లా మహాసభలు వనపర్తి జిల్లా కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో. అధ్యక్షులు హనుమంతు నాయక్ జెండా ఆవిష్కరణ చేసి. ఘనంగా నిర్వహించడం జరిగింది.
సభకు ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు, మాండ్ల రాజు,పుట్ట ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ
గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని గ్రీన్ చాలన్ ద్వారా వేతనాలు చెల్లించాలి
. రెండవ పిఆర్సి పరిధిలోకి గ్రామపంచాయతీ సిబ్బందిని తీసుకురావా లి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలి . జీవో నెంబర్ 51ని సవరించాలి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పాత కేటగిరి లన్నింటిని కొనసాగించాలి కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిలు గా నియమించాలి అర్హులైన సిబ్బందిని ప్రమోషన్లు కల్పించాలి
- పంచాయతీ సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలి ఇన్సూరెన్స్ ఈఎస్ఐపి సౌకర్యం కల్పించాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుచేయాలి
పంచాయతీ సిబ్బంది అందరిని పర్మినెంట్ చేయాలి వేతనాలు పెంచాలి
. ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేసి నేరుగా వారికి కూడా వేతనాలు చెల్లించాలి పంచాయతీల అవసరాల ప్రాతిపదికన కార్మికుల సంఖ్యను పెంచాలి
కార్మికులందరికీ ఇందిరమైన్లు ఇండ్ల పథకాలు కేటాయించాలి
చనిపోయిన అనారోగ్యానికి గురైన కార్మికుల కుటుంబాల సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలి.
ప్రభుత్వం స్పందించకుంటే నిర్వాదిక సమ్మెకు వెనుకడుగు వేయమని నేతలు హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జిల్లాలో కార్మిక హక్కుల కోసం సిఐటియు నిర్వహించే పోరాటంలో కార్మికులందరూ కలిసి రావాలని కోరుతూ గత కార్యక్రమాలను సమీక్ష చేసుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు ఆర్యన్ రమేష్. సూర్యవంశం రాము. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు. పుష్ప. హనీ ప్, శ్రీను. శివ. చందు నాగన్న. రామచంద్రయ్య. రాములు, నాగేష్ లక్ష్మీనారాయణ, గంగదేవి బద్రు, నారాయణ వివిధ గ్రామాలకు చెందిన కార్మికులు పాల్గొని నాలుగో మహాసవులను విజయవంతం చేశారు
