న్యూఢిల్లీ :మార్చి 16
సార్వత్రిక ఎన్నికల నగారా నేడు శనివారం మోగనుంది. మధ్యాహ్నం గం. 3.00 కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు సమాయత్తమైంది.
ఈ మేరకు శుక్రవారం ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ఉద యం కొత్తగా నియమి తులైన కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్న ఈ పదవులను గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన హైపవర్డ్ కమిటీ భర్తీ చేసింది. శుక్ర వారం రాత్రి రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుద లైంది.
శుక్రవారం ఉదయమే ఆ ఇద్దరు అధికారులు బాధ్యతలు చేపట్టడంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల తేదీలను ప్రకటిం చేందుకు ముహూర్తం ఖరారు చేశారు.
ఈసారి కూడా 9 దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. నోటి ఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి 30 రోజుల వ్యవధి ఉండేలా పోలింగ్ తేదీలను ఖరారు చేసినట్టు తెలిసింది..