TEJA NEWS

నూతన పరిజ్ఞానంతో విద్యార్థులకు విద్యాబోధన.

బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.

చదువుతోపాటు సంస్కారం నేర్చుకోవాలి.

బండారుపల్లి మోడల్ స్కూల్ లో
కంప్యూటర్ ల్యాబ్ ఆవిష్కరణ.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి,
గ్రామీణ నీటి సరఫరా,
మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి
అనసూయ సీతక్క.

  • జిల్లాలో నూతన పరిజ్ఞానంతో విద్యా బోధన అందించడం జరుగుతుందని, విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటూనే చదువుతోపాటు సంస్కారం నేర్చుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు సంక్షేమ శాఖమంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లిలోని పి ఎం శ్రీ మోడల్ స్కూల్ లో
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,
గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి
చందర్ లతో కలసి పాఠశాలలో కొత్తగా కంప్యూటర్ ల్యాబ్ ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత
సంవత్సరం పలు కంపెనీల సహకారంతో పాఠశాలలోని విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా విద్యా బోధన చేయడానికి అవకాశాలను మెరుగుపరచడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు త్వరగతిన
ఇంగ్లీష్ రావడానికి కంప్యూటర్లు ఎంతగానో దోహదపడుతున్నాయని, ప్రతి ఒక్కరికి
ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఇంగ్లీష్, కంప్యూటర్ జ్ఞానం లేని పక్షంలో అంత వృధా అవుతుందని, రానున్న రోజులలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ లను ఏర్పాటు
చేస్తామని స్పష్టం చేశారు.

ములుగు లాంటి గిరిజన ప్రాంతంలోని విద్యార్దులు చదువులో బాగా రానిస్తూనే పాఠశాల స్థాయి నుండే సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకొని, అభివృద్ధి చెందిన ఇతర ప్రాంతాల విద్యార్దులకు ధీటుగా
ఉన్నత స్థానంలో స్థిరపడాలని మంత్రి ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ మంత్రి సీతక్క చొరవతో ఇన్ఫోసిస్
సంస్థ చే కంప్యూటర్లను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు విద్యలో ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలని, పదిమందికి సహాయం చేసేలా, మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు, ఇతరులు గౌరవించే విధంగా ఉండాలని అన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు నైతిక విలువలు పెంపొందించే విధంగా సంబంధిత ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.

పాఠశాలకు చేరుకున్న మంత్రికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 10 కంప్యూటర్లు
కలిగి ఉన్న ల్యాబ్ ను ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యారులకు పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవకి, మండల విద్యాధికారి తిరుపతి, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ జయదేవ్, కో ఆర్డినేటర్ అర్షం రాజు, సాంబయ్య, పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.