TEJA NEWS

ప్రభుత్వ ఖజానాకు నిరాటంకముగా గండి… చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు…

ఇంటి దొంగలను ఈశ్వరుడైన కనిపెట్టలేడని….

కానీ ఇక్కడ దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు… దొంగే దొంగ అని అన్నట్లుంది పరిస్థితి గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల వ్యవహారశైలి.

ఎన్నో సంవత్సరాలుగా సాఫీగా సాగుతున్న ఇంటిగుట్టు వ్యవహారం కాస్త ఒక చరవాణి వీడియో ద్వారా బహిర్గతమైనది.

గుంటూరు మునిసిపల్ శాఖలో పొరుగుసేవల ఉద్యోగి ప్రభుత్వ వాహనమునకు చోదకుడుగా శునకాల తరలింపు ఉద్యోగం వెలగబెడుతూ గుట్టుగా సాగిస్తున్న దందాని ఒక చరవాణి వీడియో ద్వారా అక్కడే పనిచేస్తున్న పై అధికారికి చేరటం, ఆ అధికారి హయాములో, డీజిల్ చౌర్యం చేస్తున్న ఉద్యోగిపై చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతూ పై అధికారుల కళ్లుగప్పి ఇంటి దొంగ యధేచ్చగా ప్రభుత్వ వాహనము నుండి డీజిల్ తస్కరిస్తు సొమ్ముచేసుకుంటున్న వైనం ఎప్పటికి అధికారుల్లో చలనం కలుగునో వేచిచూడాల్సి పరిస్థితిలో ఉన్న గుంటూరు పురప్రజలు.

రానున్న మరో రెండు రోజుల్లో ఆ అధికారి గుంటూరు మునిసిపల్ కార్యాలయము నుండి మాతృసంస్థకు బదిలీపై వెళ్లుచున్న తరుణములో ఈ సంఘటన బహిర్గతం అవ్వడం ఆశ్చర్యం మరియు అనుమానం కలగక మానదు.