TEJA NEWS

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ కు చెందిన ఆటో కార్మికులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. సంబంధిత అధికారులతో చర్చించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS