రాష్ట్ర వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఈ విషయంలో భారతదేశం మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సాయంత్రం షాదీ ఖానాలో జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా అధ్యక్షతన జరిగిన జరిగిన ఈద్ మిలాప్ (పండగ కలయక) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈద్ మిలాప్ కార్యక్రమం చాలా గొప్పదని దీని ద్వారా సమాజంలో ప్రజల మధ్య ఐకమత్యం, మతసామరష్యం, సోదరబావము పెంపొందుతాయన్నారు అందుకే భారతదేశము అనేక మతాల సాంప్రదాయాల నిలయమని భిన్నత్వంలో ఏకత్వం అని దీని ప్రత్యేకత అని దీని అందరూ కాపాడుకోవాలని అన్నారు .ముఖ్య వక్తగా విచ్చేసిన హనుమాన్ దేవాలయం పూజారి ఇంగువ అజయ్ కుమార్ శర్మా మాట్లాడుతూ మనం మంచి వ్యక్తులుగా మారాలంటే తప్పనిసరిగా దైవ సూత్రాలు ఆధారంగా జీవించాలన్నారు మనందరికీ సృష్టికర్త ఒకడని ఆయన మాటల్ని మనం అర్థం చేసుకోలేకపోవటం వల్లే సమాజంలో అలజడలు చెలరేగుతున్నాయన్నారు మనిషి సత్యం మాట్లాడుతూ ధర్మంగా బ్రతకాలి మనందరం పరస్పరం సోదరులుగా మెలుగుతూ ధర్మ మార్గంలో నడిస్తే దేవుడు కూడా సంతోషిస్తాడన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. మరొక అతిథి చెర్చి పాస్టర్ జాకబ్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ బైబిల్ గ్రంథం కూడా పరమత సహనాన్ని సోదర భావాన్ని బోధిస్తుందన్నారు మనిషి తన వలె తన పొరుగు వారిని ప్రేమించాలన్నారు పరస్పరం సోదరులుగా మెలుగుతూ దైవ సూత్రాల ప్రకారం జీవితం గడిపితే సుఖ సంతోషాలతో ఉంటామన్నారు.చివరిగా జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు సాదిఖ్ అహ్మద్ మాట్లాడుతూ మనందరి సృష్టి కర్త అయిన దేవుడు ఒక్కడే. మనమంతా ఒక్కటేనని, కులమతాలకు అతీతంగా ఒకరి సుఖదుఃఖాలను మరోకరు పంచుకుంటూ కలిసి మెలిసి జీవించినప్పుడే సమాజం లో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయని అన్నారు. మనుషులంతా ఒక్కటేనని, కులమతాల హెచ్చుతగ్గులు లేవని, ఉన్నదాంతో తృప్తి పడుతూ, మంచివారిగా జీవించాలి రంజాన్ ఉపవాసాలు శిక్షణ ఇస్తాయని అన్నారు. ఒకరి పండుగలు పర్వదినాలు మరోకరు పంచుకుంటే ప్రేమానురాగాలు ఆప్యాయత అనుబంధాలు పెరుగుతాయని అన్నారు.
దివ్య ఖుర్ఆన్ బోధనలు మానవాళికి ఇహంలోనూ, పరంలోనూ దారిచూపుతాయని, మంచి, చెడుల విచక్షణ చూపే ఈ గ్రంథం రమజాన్ నెలలో అవతరించిందని అందుకుగాను రమజాన్ నెలకు ప్రాముఖ్యం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ అర్ జీవన్ కుమార్ , బుద్దిస్ట్ పిడమర్తి వి సిద్దార్ద , జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ సమి, ఖిల్లా, ఇంద్రనగర్, ఇస్లాంపేట అధ్యక్షులు అబ్దుల్ మలిక్, అబ్రార్ అలీ, షేక్ రఫీ సభ్యుల , ఖలిల్ అహ్మద్ ఖాన్, అబ్దుస్ సుబూర్, అబ్దుల్ ముజీబ్ ,యూసఫ్ షరీఫ్, గౌస్ ,నిజాముద్దీన్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అస్మా అన్జుమ్, ఖిల్లా, ఇంద్రనగర్, ఇస్లాంపేట అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్, హుస్సేన్ బీ, ఖాసిమ షాహిన్, సభ్యులు గౌసియ, నస్రీన్ , హాజిరా, సీమ అతహర్ , అఫ్‌రోజ్, సమీన, ఆరిఫా, జాహెరా స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు అమీర్ ఒసామా, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ హలీం, గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పట్టణ అధ్యక్షురాలు ఖదిజతుల్ కుబ్రా , సెక్రటరీ సీమా నాజనీన్, యం పి జె జిల్లా అధ్యక్షులు ఖాసిం, రాయల నాగేశ్వరావు ,సాదు రమేష్ రెడ్డి ,తుపాకుల ఎలగొండ స్వామి, పుచ్చకాయల వీరభద్ర, మహమ్మద్ అష్రూప్, అహసన్, చంద్ర శేఖర్ , రాము, మధు,వెంకన్న మరియు పట్టణ పలువురు ముస్లిం మరియు ముస్లిమేతర సోదరులు పాల్గొన్నారు.