శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలు
పండగ వాతావరణం తలపించిన శ్రీ చైతన్య ఎలక్షన్ సందడి
–
జగిత్యాల/వెల్గటూర్:
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ నిర్వహించి అబ్బాయిల నుండి ఒకరిని, అమ్మాయిల నుండి ఒకరిని అధ్యక్షులు గా ఎన్నుకోవడం జరిగింది. పాఠశాల కరస్పాండెంట్ బిడారి సతిష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఆయుధం, పారదర్శక పాలన కావాలన్నా, మంచి నాయకులు పరిపాలించాలన్న, ఓటుతోనే సాధ్యమని తెలిపారు. అలాంటి బృహత్తర కార్యక్రమం ను మా పాఠశాలలో పిల్లల కు తెలియజేయాలని ఉపాధ్యాయ సూచన మేరకు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
విద్యార్థుల కు ఎన్నికల గురించి తెలియజేయాలని ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ లు గా మమత, సాహితి, పర్యవేక్షణ అధికారిగా వైస్ ప్రిన్సిపల్ జ్యోతి దగ్గరుండి పర్యవేక్షించారు .ప్రతి ఇంచును వీడియోల ద్వారా ఫోటోల ద్వారా ఉపాధ్యాయులు మల్లీశ్వరి, సమత పోటీలో పాల్గొన్న విద్యార్థులను ఉత్తేజపరిచారు. చివరిగా అబ్బాయి లలో అధ్యక్షుడిగా శ్రీ సాధ్విక్, బాలికలలో అధ్యక్షురాలుగా సహస్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ మమత ప్రకటించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎండి. శహిదొద్దిన్, రాజేష్, శ్రావణి, అంజలి,కార్తీక, శిరీష, నవ్య, అనూష, మంజు భార్గవి, శ్రీలేఖ, వనజ,రజిత, ఆండాళ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.