TEJA NEWS

సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జానంపేట రాములు ఎన్నిక

  • నియామక పత్రానంద చేసిన రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సింహాద్రి సాక్షిత వనపర్తి నవంబర్ 25 సమాజవాది పార్టీ జిల్లా అధ్యక్షులుగా గత నాలుగు సంవత్సరాలు రెండు పర్యాయలుగా కొనసాగుతున్న జానంపేట రాములుని తెలంగాణ రాష్ట్ర కమిటీ లోకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం జరిగిందని సమాజ్వాది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కల బాబుగౌడ్ తెలిపారు ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సింహాద్రి చేతులు మీదుగా హైదరాబాదు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని రాములు కు అందజేసినట్లు బాబు గౌడ్ తెలిపారు
  • ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నికైన జానంపేట రాములు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ప్రధాన కార్యదర్శి బాబు గౌడ్లు తనపై నమ్మకముంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతవరకు జిల్లాలో పార్టీ ఉన్నతికి అభ్యున్నతికి కృషి చేశానని ఇకపై కూడా జిల్లాలో మాదిరిగా రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని జానంపేట రాములుతెలిపారు. జిల్లాలోని పలువురు ఇతర పార్టీ నాయకులు రాములు కు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా స్థానం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

TEJA NEWS