Election of Lok Sabha Speaker on 26
26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక
లోక్‌సభ స్పీకర్‌ను జూన్ 26న ఎన్నుకోనున్నారు. అయితే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు తేదీ మాత్రం ప్రకటించలేదు. 2019 నుండి డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. ఇప్పటి వరకు భారత పార్లమెంటు పదిహేడు మంది లోక్‌సభ స్పీకర్లను చూసింది. అత్యధిక కాలం పని చేసిన స్పీకర్‌గా బలరాం జాఖర్ (జనవరి 22, 1980 నుండి డిసెంబర్ 18, 1989 వరకు) పేరొందారు.