TEJA NEWS

Enroll your children in a government school…

మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి….

  • ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న
  • జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ… గద్వాల నియోజకవర్గం గద్వాల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల నందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరభాస్యం జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ముఖ్య అతిధులుగా పాల్గొని పాఠశాల ఆవరణలోని సరస్వతి విగ్రహాన్నికి పూలమాలలు వేసినంతరం విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించారు…అనంతరం సరితమ్మ మాట్లాడుతూ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి,మీ పిల్లల భవిష్యత్తు కు బంగారు బాటలు వేసుకోవాలని సరితమ్మ పిలుపునిచ్చారు…అనుభవజ్ఞులైన, క్వాలిఫైడ్ టీచర్లచే విద్యాబోధన తో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుచున్న విద్యార్థులకు ఉచితంగా చదువు,పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లత్తిపురం వెంకట్రామిరెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, డిఈఓ ఇందిరా, ఎంఇఓ సురేష్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వెంకట నర్సయ్య,హంపయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ నరహరి గౌడ్, పూడూర్ ఈశ్వర్, డిటిడిసి నర్సింహులు, పాపి రెడ్డి, అక్బర్‌ బాషా,భాస్కర్ రెడ్డి,జమ్మిచేడు ఆనంద్, వెంకట్రాములు, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు,కొండపల్లి రాఘవేంద్ర రెడ్డి,బ్రాహ్మేశ్వర్ రెడ్డి,లక్ష్మణ,రాము,రాఘురామి రెడ్డి,అబ్దుల్,కృష్ణాముర్తి,ఆనంద్ గౌడ్, ఈశ్వర్,ఓబులోనిపల్లి పరుశ, పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు, అంగనవాడీ టీచర్లు కే.రేణుక దేవి,వై.రేణుక దేవి, ఆదర్శ పాఠశాల చైర్మన్ ఫారీద తదితరులు ఉన్నారు


TEJA NEWS