పచ్చటి మొక్కలతోనే భవిష్యత్తు తరాలకు భరోసా
- షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” వన మహోత్సవం యజ్ఞంలా కొనసాగాలి
- ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి మున్సిపల్ పరిధిలో 1.10 లక్షల మొక్కల లక్ష్యం వన మహోత్సవ ప్రారంభోత్సవంలో మున్సిపల్ కమిషనర్ నరేందర్,కమిషనర్ వెంకన్న హాజరు
పచ్చటి మొక్కలు నాటడమంటే భవిష్యత్తు తరాలకు మంచి భరోసా ఇవ్వడమేనని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అదేవిధంగా వనమహోత్సవం ఒక యజ్ఞం లా కొనసాగాలని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డిగ్రీ కళాశాల మైదానం, పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ మున్సిపల్ చైర్మన్ నరేందర్ కమిషనర్ చీమ వెంకన్న, కౌన్సిలర్లు స్థానిక నేతలు కార్యకర్తలు అధికారులు సిబ్బంది కమిషనర్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాద్ నగర్ వ్యాప్తంగా వన మహోత్సవం పురస్కరించుకొని మొత్తం 1.10 లక్షల మొక్కలు నాటుతామని తెలిపారు. వరమోత్సవం మొదటిరోజు వెయ్యి ముక్కలు నాటుతున్నామని చెప్పారు. డిగ్రీ కళాశాల మైదానంలో 500 మొక్కలు ఇతర బహిరంగ ప్రదేశాలలో మరో 500 మొక్కలు ఈ ఒక్క రోజుల్లోనే నాటుతామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని, నాటడంతోపాటు, వాటి సరంక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల లెక్చరర్ డాక్టర్ రవీందర్ రెడ్డి, చెంది తిరుపతిరెడ్డి విశాలా విశ్వం బాలరాజ్ గౌడ్, ఎంపీటీసీ కృష్ణ, జూపల్లి కౌసల్య, పిల్లి శారద శేఖర్, ఇబ్రహీం కౌన్సిలర్ జి టి శ్రీనివాస్, ఆలోనిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర్ రాజు, ముబారక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..