TEJA NEWS

అలరించిన భ్రమరీ కూచిపూడి డాన్స్ అకాడమీ నృత్యార్చన

అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు గారి సారధ్యంలో ప్రతి శనివారం జరిగే అన్నమ స్వరార్చన మరియు నృత్యార్చన కార్యక్రమంలో ఈ శనివారం శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి తొలుత శోభా రాజు గారి విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, అన్నమ గురుస్తుతితో ప్రారంభించగా అనంతరం శ్రీ భ్రమరీ కూచిపూడి డాన్స్ అకాడమీ గురువు శ్రీమతి సునీత దివాకరుని గారు మరియు వారి శిష్య బృందం వరేణ్య, వేదాంన్ష్, శ్రీద్ధ, శ్రీనిధి, రుషిక, చార్వి, పర్నిత, ప్రనవి, ఆరోహి, పుష్ప సంయుక్తంగా తమ తమ కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అద్భుతంగా మెప్పించారు. ఇందులో భాగంగా, “మూషిక వాహన, తిరు తిరు, డొలయాంచల, భావయామి గోపాల బాలం, పొడగంటిమయ్య, కులుకు, దశావతార శబ్దం” అనే సంకీర్తనలపై కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రదర్శించారు. తదనంతరం కళాకారులను సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు గారు శాలువా మరియు జ్ఞాపికతో సత్కరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళ హారతి ఇచ్చారు మరియు పసందైన ప్రసాద వితరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.


TEJA NEWS