
ఎస్సై అంతిరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు?
సూర్యాపేట జిల్లాలో 10, వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు చింతల పాలెం ఎస్సై అంతిరెడ్డి, రేషన్ బియ్యం అక్రమ రవాణపై గతేడాది అక్టోబర్ 23న నమోదైన కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే సూర్యాపేట జిల్లా చింతలపాలెం ఎస్‌ఐ అంతిరెడ్డి రూ.15 వేలు లంచం డిమాండ్ చేసి.. రూ.10 వేలకు ఒప్పందానికి వచ్చారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు నల్లగొండలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు మంగళ వారం, సాయంత్రం రూ.10 వేల నగదు ఇస్తుండగా తీసుకుంటున్న ఎస్‌ఐ అంతిరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఎస్సై అంతిరెడ్డి, ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
