పుట్టుకతో కంటిచూపు లేకపోయినా చూడొచ్చు!
చూపులేని వారికి టెస్లా CEO ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. తన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ రూపొందించిన పరికరాన్ని USFDA ఆమోదించినట్లు తెలిపారు. ఈ బ్లెండ్సైట్ పరికరం ద్వారా కళ్లు, కంటి నాడిని కోల్పోయినా చూడగలరు. దృష్టి కణాలు పాడవకపోతే పుట్టుకతో చూపు లేనివారు కూడా చూడొచ్చు. దీని ద్వారా తొలుత తక్కువ రిజల్యూషన్లో కనిపించినా భవిష్యత్లో సహజ దృష్టి కంటే మెరుగయ్యే అవకాశముందని మస్క్ తెలిపారు.