ప్రభుత్వభూమి అని తెలిసికూడా కబ్జాను అరికట్టకపోవడం దారుణం.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం జోన్ జగత్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప షాపింగ్ కాంప్లెక్స్ కోసం ప్రస్తుతం రేషన్ షాప్ వద్ద స్థలం కేటాయిస్తే అది నేడు అధికారులకు తెలిసి కూడా కబ్జా చేస్తుంటే అధికారులు కబ్జాను అరికట్టకుండా పైకి కబ్జాదారులకు పట్టా ఉంది కాబట్టి కట్టుకుంటున్నారు అని సమాధానం ఇవ్వడం దారుణమని అన్నారు.అధికారులు అది వాస్తవంగా ప్రభుత్వస్థలమే కాని సదరు కబ్జాదారులు జి ఓ58 ప్రకారం వారికి 348/1 సర్వే నంబర్లో వారికి పట్టా ఉందని కాబట్టి వాళ్లు కట్టుకుంటున్నారని అనడం కబ్జాలను నివారించకుండా కబ్జాదారులకు పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని అలా అంటే పట్టాలు ఉండి స్థలం లేని ప్రజలు చాలామంది ఉన్నారని వాళ్లు కూడా అలాగే కబ్జాచేసుకుంటే ఊరుకుంటారా అని ప్రశ్నించడం జరిగింది. అసలు ముందుగా అక్కడ ఒక రూమ్ మాత్రమే ఉందని నేడు మొత్తం స్థలం మాదే అంటూ కబ్జాకు పాల్పడుతున్నారని అన్నారు.
ఇదే స్థలం పై గత నెలలో ఆర్ ఐ గారు ఆ స్థలం లో నిర్మాణాలను అడ్డుకొని ,మళ్ళీ నేడు అడ్డుకోకపోవడం దారుణమని అన్నారు. కనీసం ఆ పట్టా నిజమైనదా కాదా అనేది కూడా తెలుసుకోకుండా కబ్జాదారులకు సహకరించడం పై పెచ్చు మునిసిపల్ అధికారులు పెర్మిషన్ ఇచ్చారు అని అనడం అందరు అధికారులు కబ్జాలకు ప్రోత్సాహిస్తుందనే అభిప్రాయం ప్రజలో ఉందని ఆ అభిప్రాయం పోవాలంటే ముందుగా ఆ పట్టా అసలుదా కాదా అనేది తేల్చేంతవరకు కట్టడాన్ని ఆపివెయ్యాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో వచ్చే ప్రజావాణిలో కలెక్టరకు,హైడ్రా కమీషనర్ కు పిర్యాదుచేస్తామని అక్కడ ప్రజలకు ఉపయోగపడేవిదంగా ఉండేలా ఏర్పాటు కావడానికి పోరాటం చేస్తామని హెచ్చరించారు.