గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వంలో చలనం ఉండదా……………………. మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి
.
- సంబంధిత శాఖ మంత్రులు లేకే ఇలాంటి సంఘటనలు పునరావృత్తం
వనపర్తి
రాష్ట్రములోని గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల రోజుకో గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురై మరణిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా ఊదాసినతగా వ్యవహరించడం పట్ల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
20 రోజులకు పైగా చికిత్స పొందుతూ నిన్ననే గురుకుల విద్యార్థిని శైలజ మరణించింది మంగళవారంమళ్లీ ఉమ్మడి పాలమూరు జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి
ఆసుపత్రిలో 30కి పైగా విద్యార్థులు చేరారని ఇందుకు
ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే సమస్యలకు కారణం అని ఆయన అన్నారు.
ఏడాది కావస్తున్నా విద్యా శాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖమంత్రుల నియామకానికి దిక్కు లేదు.
మంత్రి లేక దారితప్పిన గురుకుల విద్యావ్యవస్ధ .. ప్రభుత్వంలోని అనేక శాఖల మీద పర్యవేక్షణ లేకపోవడం మూలంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి అని ఆయన దుయ్యబట్టారు.
గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని
ఆసుపత్రి పాలైన విద్యార్థులకు నాణ్యమైన చికిత్స అందించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఘటనపై ఒక ప్రకటనలో స్పందించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోని విద్యార్థులకు భద్రత,తల్లితండ్రులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.