TEJA NEWS

బ్యాంకులు అందించే సేవలనుప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి……….సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్ కోఆర్డినేటర్ అశోక్
వనపర్తి
బ్యాంకుల్లో అందించే సేవలు ప్రతి ఒక్కరూ విశ్వసించదగినవని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్ కోఆర్డినేటర్ అశోక్, లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం) కౌశల్ కిషోర్ లు చెప్పారు.

  జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి సూచనల మేరకు జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉద్యోగులందరికీ ఆర్థిక అక్షరస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

   ఈ సందర్భంగా సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్ కోఆర్డినేటర్ అశోక్ మాట్లాడుతూ బ్యాంకుల్లో అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత సాధించాలంటే పొదుపులతోనే సాధ్యపడుతుందన్నారు. ప్రభుత్వ బీమా పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన పథకాల ద్వారా ఉండే లబ్దిని వివరించారు. 20 రూపాయలతో కూడిన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజనతో బీమా చేయించుకుంటే ఆపద సమయాల్లో బాధిత కుటుంబాలకు రూ.2లక్షల వరకు ప్రమాద భీమా సొమ్ము అండుతుందన్నారు. భీమా చేయించుకొని ధీమాగా ఉండాలని అన్నారు. స్మార్ట్ఫోన్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ భద్రత, డిజిటల్ సేవలపై ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు  డిజిటల్ లావాదేవీల పద్ధతులతో పాటు, సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులు, బ్యాంకింగ్ ప్రాముఖ్యతపై ఖాతాదారులకు వివరించారు.

   సమావేశంలో అసిస్టెంట్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సాయి, ఎస్ ఎస్ టి డిస్టిక్ కోఆర్డినేటర్ శేఖర్ రెడ్డి, అన్ని జిల్లా శాఖల అధికారులు, సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు.

TEJA NEWS