జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ

జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ

TEJA NEWS

భారత్‌కు దౌత్య విజయం.. ఖతర్‌ జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ

ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలపై 2022లో 8 మంది భారత నేవీ మాజీ అధికారుల అరెస్టు

2023లో నిందితులకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు

భారత ప్రభుత్వ అప్పీలుతో మరణ శిక్షను జైలు శిక్షగా కుదింపు

తాజాగా మాజీ అధికారులందరినీ విడుదల చేసిన కోర్టు

భారత విదేశాంగ శాఖ ప్రకటన

గూఢచర్యం నేరంపై ఖతర్‌ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. భారత్ ప్రయత్నాలు ఫలించడంతో ఖతర్ ప్రభుత్వం ఎనిమిది మందిని భారతీయ అధికారులను విడుదల చేసింది. సోమవారం భారత విదేశాంగ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఎనిమిది మందిలో ఏడుగురు భారత్‌కు తిరిగొచ్చేశారని వెల్లడించింది.

ఏమిటీ కేసు..
గల్ఫ్‌లో అల్ దహ్రా అనే కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులను 2022 ఆగస్టులో అక్కడి పోలీసులు గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు చేశారు. కెప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమేండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగునాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తాలకు గతేడాది అక్టోబర్‌లో అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం కోర్టులో అప్పీలు దాఖలు చేసింది. అనంతరం, న్యాయస్థానం నేవీ మాజీ అధికారుల మరణ శిక్షను జైలు శిక్షగా తగ్గించింది. తాజాగా వారందరినీ విడుదల చేసింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS