TEJA NEWS

మందస సమీపంలో రెండుగా విడిపోయిన ఫలక్నమా రైలు.. తప్పిన ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. పలాస నియోజకవర్గంలోని మందస సమీపంలో సికింద్రాబాద్ నుంచి వస్తున్న ఫలక్నామా 12707 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు రెండుగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం. రైల్వే అధికారులు జాయింట్ పనులు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి
ఉంది.