TEJA NEWS

పెన్షన్ పొందుతున్న జర్నలిస్టుల కుటుంబాలు నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి………. డి పి ఆర్ ఓ

వనపర్తి
వనపర్తి జిల్లా
జర్నలిస్టుల కుటుంబాల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంక్షేమ నిధి నుండి పెన్షన్ పొందుతున్న పెన్షన్ దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిందిగా జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం నేడోక ప్రకటనలో తెలిపారు.
ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన లైఫ్ సర్టిఫికెట్ నవంబర్ 30 లోపు పెన్షన్ దారులు స్వయంగా జిల్లా పౌర సంబంధాల అధికారి ముందుకు వస్తె అక్కడే లైఫ్ సర్టిఫికెట్ జారి చేయడం జరుగుతుందనీ, సకాలంలో లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వని వారి పెన్షన్ నిలుపుదల చేసే అవకాశం ఉన్నందున జిల్లాలోని జర్నలిస్టు పెన్షన్ దారులు సకాలంలో లైఫ్ సర్టిఫికెట్ సనర్పించాల్సిందిగా తెలియజేసినారు.


TEJA NEWS