TEJA NEWS

రైతులకు సంకెళ్ళా…?

-ప్రభుత్వం వెంటనే రైతులను విడుదల చేయాలి..

-ప్రగతి నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు &నేతలు.

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలలో భాగంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,కార్పొరేటర్లు గాజుల సుజాత, బాలాజీ నాయక్, బొర్రా దేవి చందు ముదిరాజ్, కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి జ్యోతి సతీష్, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు,లగచర్ల రైతుల గోసలు వినతిపత్రం రూపంలో సమర్పించి నిరసన తెలియచేసారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో వారిని ఇబ్బందులు పెట్టి సంకెళ్లు వేసి జైలుకు పంపండం అన్యాయం అన్నారు.ప్రభుత్వం రైతుల పట్ల ఒక నియంతలా వ్యవహరిస్తుంది. గిరిజన రైతులను అక్రమంగా అరెస్ట్ సంఘటనలు మళ్లీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రములో ఎక్కడ పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తక్షణమే లగచర్ల రైతులను జైలు నుంచి విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం కంటే కూడా ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా అధ్యక్షులు, యువజన విభాగ అధ్యక్షులు,డివిజన్ అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్స్, ఉద్యమకారులు,మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS