ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం
ఢిల్లీ:
కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ తెలిపారు.
కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
తమ సమస్యలనైనా పరిష్కరించాలని, లేదంటే ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా బారికేడ్లను తొలగించాలని ఆయన డిమాండు చేశారు.