
రైతులకు నీళ్లు లేవు…. కూలీలకు పనిలేదు.. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..*
చిలుకూరులో పంట పొలాల పరిశీలన.. రైతులు, వ్యవసాయ కూలీలతో మాజీ ఎమ్మెల్యే భేటీ
చిలుకూరు:
చిలుకూరు మండల కేంద్రంలోని పంట పొలాలను పరిశీలించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులు, వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగునీటి కొరతతో నాట్లతో పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు బీడుగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలపై నిపుణులు ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లలో నీరు అందక రైతులు పరిమిత విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారని, రైతులు వ్యవసాయం చేయలేకపోతే వ్యవసాయ కూలీలకు కూడా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు తప్పవని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు పనుల కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
సాగునీటి లభ్యతపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వడంతో పాటు కరువు నివారణ చర్యలను అత్యవసరంగా చేపట్టి రైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చిలుకూరు గ్రామ ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య సొసైటీ చైర్మన్ అలస కాని జనార్ధన్ చిలుకూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జానకి రామాచారి తాళ్లూరి శ్రీనివాస్, బండి కాశయ్య, అంబాల వెంకటి, బెల్లంకొండ సైదులు, గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.