TEJA NEWS

Farmers should take precautions while buying seeds

విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ గీతారెడ్డి తెలిపారు. శంకర్‌పల్లి మండల కేంద్రంలోని మహాలింగాపురం గ్రామంలో రైతులకు విత్తనాలు కొనుగోలు విషయంలో అవగాహన కల్పించేందుకు రైతు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు విత్తన ప్యాకెట్లు లూజుగా ఉంటే తీసుకోకూడదని పూర్తి ప్యాకెట్టు ఉంటేనే కొనుగోలు చేయాలని తెలిపారు. లూజు విత్తనాలు కొనుగోలు చేస్తే నకిలీ
విత్తనాలు వచ్చే ప్రమాదం ఉందని దీని ద్వారా రైతులు నష్టపోతారని తెలిపారు. ఒక వేళ విత్తనాలలో ఏదైనా నకిలీ విత్తనాలు వచ్చిన సమస్యలు వచ్చిన అధికారులకు తెలిపేందుకు రసీదు ఉండాలి. కాబట్టి రైతులు విత్తనాలు కానీ ఎరువులు కానీ కొనే ముందు ఏ దుకాణంలో కొంటారో ఆ దుకాణంలో కచ్చితంగా రసీదు తీసుకోవాలని తెలిపారు. ఎందుకంటే విత్తనాలలో ఏదైనా లోపం సంభవించిన రసీదు దానితోపాటు విత్తనం యొక్క కాళీ ప్యాకెట్ ను కూడా భద్రముగా దాచుకున్నట్లయితే సమస్య వచ్చినప్పుడు వాటి గురించి తెలుసుకోవడానికి సులువుగా ఉంటుందని తెలిపారు. విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ కొనకుండా వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన దుకాణంలోనే కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ సహాయక సంచాలకులు రమాదేవి, శంకర్‌పల్లి మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారి రమ్య మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు


TEJA NEWS