TEJA NEWS

హైదరాబాద్:మార్చి 06
సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవు తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పార్టీలన్నీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నాయి.

రేపు టీ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది.ఢిల్లీ లో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగ నుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.

అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్ కి అధిష్ఠానం అప్ప జెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హై కమాండ్‌కి వివరించను న్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు అంటున్నారు.

తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను రేపు ఏఐసీసీ ప్రకటించ నుంది…


TEJA NEWS