ఐదు సంవత్సరాలు తమ పరిపాలనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు
శంకర్‌పల్లి మండల సమావేశంలో
ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి
శంకర్‌పల్లి: ,తమ ఐదు సంవత్సరాల పరిపాలనకు సహకరించిన అధికారులకు శంకర్‌పల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు డి. గోవర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో చివరి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు గ్రామాల అభివృద్ధికి అధికారులు ఎంతో సహకరించాలని కొనియాడారు. ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఇబ్బందులు ఉన్న ఎంపీటీసీలు తమ గ్రామాల అభివృద్ధికి ఎంతో పాటుపడాలని కొనియాడారు. కాగా కొందరు అధికారులు ప్రజాప్రతినిధులను చులకనగా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ తమ విధులను సక్రమంగా నిర్వహించలేదని తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ అధికారులు ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు చేశారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను ఖర్చు చేసి ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేశారని తెలిపారు. కాగా మండల సర్వసభ్య సమావేశంలో ఆయా శాఖల అధికారులు జరిగిన పనుల వివరాలను తెలిపారు. అనంతరం ఎంపీపీ గోవర్ధన్ రెడ్డిని ఎంపీటీసీలు, ఎంపీడీవో ఇతర శాఖల అధికారులు శాలువతో సత్కరించారు. వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవల్లిక వెంకట్ రెడ్డి ని కూడా శాలువాతో సత్కరించారు. ఎంపీటీసీలు ఒక్కొక్కరిని ఎంపీడీవో వెంకయ్య గౌడ్, ఎంపీపీ శాలువులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గీత, సూపరిండెంట్ రవీందర్, ఏపీవో నాగభూషణం, ఏపీఎం భీమయ్య, పశు వైద్యాధికారి డా. జయసుధ, వాటర్ వర్క్స్ ఏఈ చంద్రమోహన్ రెడ్డి, విద్యుత్ అధికారి ప్రవీణ్, ఐసిడిసి అధికారి యశస్విని, మండల వ్యవసాయ ఇన్చార్జి అధికారి చైతన్య, టంగుటూరు మెడికల్ ఆఫీసర్ డా. శ్రీనివాస్, మోకిల విద్యుత్ అధికారి ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీలు నాగేందర్, శోభ, బద్దం సురేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మేఘన, యాదగిరి, కో ఆప్షన్స్ సభ్యుడు ఎండి. నయీమ్, ఆయా అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఐదు సంవత్సరాలు తమ పరిపాలనకు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…