TEJA NEWS

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన ఫ్లెమింగ్ ల్యాబరేటరి కార్మిక సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద ఫ్లెమింగ్ ల్యాబరేటరీ కార్మికులు మర్యాదపూర్వకంగా కలిసి కార్మిక ఒప్పంద అగ్రిమెంట్ కు కృషిచేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ని సన్మానించడం జరిగింది..

అనంతరం కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ కూన శ్రీశైలం గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

నియోజకవర్గం ప్రజలకు, కార్మిక కర్షకులకు ఎల్లప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు..

ఈ సమాజ మనుగడ శ్రామిక లోకంతో ముడిపడి ఉందన్నారు..

రాజనీతిజ్ఞుడిగా ప్రజలకు సేవచేస్తూ, కార్మిక నాయకుడిగా కార్మికుల సమస్యలపై పోరాడుతనన్నారు..

ఈ కార్యక్రమంలో అడ్వైసర్ మల్లేశం, జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వరా రావు, కార్మిక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..