TEJA NEWS

సొంతింటి కల నెరవేరింది అన్న ఆనందం పేదల కళ్లలో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది…. ఎమ్మెల్యే డా భూక్యా మురళి నాయక్

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్ లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే డా భూక్యా మురళి పాల్గొన్నారు…

ఈ సందర్భంగా ఎమ్మేల్యే డా మురళి నాయక్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుపేదలకు పడుకోవడానికి కనీసం వసతి లేదు అల్లుడు వస్తే ఎక్కడ పండాలి అని మీకోసం నిను డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని మాయ మాటలు చెప్పి 10 ఏళ్లు అధికారం లో ఉండి కనీసం ఒక్క నిరుపేద కుటుంబానికి అయిన డబుల్ బెడ్ రూం అయిన ఇచ్చిందా అని విమర్శించారు.

గత పాలకుల తప్పిదమే మనం ఇంత వెనుకబాటుకు కారణం అని తెలియజేశారు…కనీసం పేదలు నివసించడానికి ఇళ్లు లేవని గుర్తించిన మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వారి కోసం ఇందిరమ్మ ఇళ్లను వారికి అందించి పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ చేపడుతుందని తెలియజేశారు..అంతే కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ఇకనైనా మీరు ఆది గమనించి మన కాంగ్రెస్ ప్రభుతానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు…ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో మీరు ప్రభుత్వం ఇచ్చిన నియమాలను పాటించి ఇళ్లు నిర్మించుకోవాలి.దాని ప్రకారమే మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నిధులు ఇస్తుంది అని తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట అన్ని శాఖలకు సంబంధించిన మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మండల నాయకులు డైరెక్టర్లు,మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు….