ట్రాఫిక్ నిబంధనలు పాటించండి..సిఐ శివశంకర్

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి..సిఐ శివశంకర్

TEJA NEWS

.మల్కాజ్గిరి లో సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పలు సూచనలు చేశారు. మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ చాణక్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ కాలనిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి వాహనాలు నడపాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని అన్నారు. చాలా మంది హైవే రోడ్డును వాడకుండా షార్ట్ కట్ ఉంటుందని గల్లీలో వాహనాలు నడపడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని అన్నారు. మల్కాజ్గిరి ప్రజలకు ట్రాఫిక్ వల్ల సమస్య ఉంటే నేను ప్రతినిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జోసఫ్ అల్విన్, అన్నయ్ దేవదాస్, విశ్వనాథన్, సకాయ్ కుమార్, ఉదయ్ సింగ్, వీణ కృష్ణ, సుజా కిషోర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS