
” హ్యాపీ హంప్టీస్ ప్లే జోన్ ” ను ప్రారంభించిన మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు …
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ సుజై కమర్షియల్ కాంప్లెక్స (డిమార్ట్ పక్కన) పవన్ కుమార్ కంటిమహంతి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “హ్యాపీ హంప్టీస్ ప్లే జోన్” ను మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు రఘూవేంద్ర రావు, కోలన్ వీరేందర్ రెడ్డి, ఆగం పాండు తో కలిసి ప్రారంభించారు.అనంతరం హ్యాపీ హంప్టీస్ ప్లే జోన్ యజమానులు ముఖ్య అతిధులను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ యువత ఉద్యోగాన్వేషణ కాకుండా సొంత వ్యాపారాలు స్థాపించే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు జి. విష్ణువర్ధన్ రావు, పి.రాంబాబు, సిహెచ్ లింగయ్య, యువ నాయకులు బాలు హ్యాపీ హంప్టీస్ ప్లే జోన్ యజమానులు పవన్ కుమార్ కంటిమహంతి మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
