కెసిఆర్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

కెసిఆర్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

TEJA NEWS

కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని,
బిఆర్ఎస్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి ,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట నియోజకవర్గంలోని టేకుమట్ల గ్రామంలో నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన జగదీష్ రెడ్డి మాట్లాదారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి, నలగొండ పార్లమెంట్ స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని తమ ఓటమి ఖాయం అయిందనే పోలీసులను ఉపయోగించి బిఆర్ఎస్ శ్రేణులను భయపెడుతున్నారని, జానారెడ్డి , ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరించడం దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలోనే తమ నరకం చూసామని ప్రజలే మాకు స్వయంగా చెబుతున్నారని అన్నారు. మే 13వ తేదీన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా కంకణ బద్ధులై ఉన్నారని అన్నారు. గడచిన నాలుగేళ్లలో ధాన్యం దిగుబడిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న నల్గొండ జిల్లా ఈసారి ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు? దీనికి కారకులు ఎవరైనా విషయాన్ని రైతులు గ్రహించారని అన్నారు.


మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వ, తెలంగాణ జలాలను తమిళనాడుకు తరలించాలని బిజెపి వేస్తున్న ఎత్తుగడలను చిత్తుచేసి వారి మెడలు వంచే సత్తా కెసిఆర్ కి మాత్రమే ఉందని ప్రజలు గుర్తించారన్నారు. రైతుబంధు పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆడితున్న నాటకాలను రైతాంగం గ్రహించారని ఎన్నికల్లో రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు రైతులు, ఉద్యోగులు, పెన్షనర్లు, సబ్బండ వర్గాలు కెసిఆర్ తోనే ఉన్నాయని అన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS