TEJA NEWS

కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతుంది: మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్:
ఇందిరమ్మ రాజ్యంలో కనీసం మీటింగ్‌ పెట్టుకునే పరిస్థితి లేదా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ నేతల అక్రమ అరెస్టులపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కనీసం మీటింగ్‌ పెట్టుకునే పరిస్థితి కూడా లేదా అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అంటే ముఖ్య మంత్రి వెన్నులో ఎందు కంత వణుకు అని దాడి చేసిన కాంగ్రెస్‌ గూండాలను వదిలి, బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులా అని నిలదీశారు.

సీఎం కనుసన్నల్లో సాగు తున్న ఈ అక్రమ విధానా లను తెలంగాణ సమాజం గమనిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అప్రజాస్వామి కంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్‌ హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ అణచి వేత చర్యలకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడిన ప్రతీ బీఆర్‌ఎస్‌ సైనికుడికి హృదయపూర్వక వందనం. బీఆర్‌ఎస్‌ నిజమైన బలం మన దృఢమైన క్యాడర్‌లో ఉందని మన కార్యకర్తులు మరోసారి నిరూపించార న్నారు.

తెలంగాణ గౌరవాన్ని, అస్థిత్వాన్ని, భవిష్యత్తును అందరం కలిసి కాపాడు కుందామంటూ, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ట్వీట్‌ చేశారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS