TEJA NEWS

పర్వీన్ కుటుంబానికి అండగా ఉంటా : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • పిడుగుపాటు మృతులకు ప్రభుత్వం అందించే రూ.4లక్షలతో పాటు, ఈ-శ్రమ్ పోర్టల్ లో మృతురాలి వివరాలు నమోదైనందున కేంద్రం నుంచి రావాల్సిన రూ.2లక్షల సాయం వెంటనే పర్వీన్ కుటుంబానికి అందేలా చూడాలని అధికారులకు సూచించిన ప్రత్తిపాటి.

పొలంలో కూలీపనికి వెళ్లి పిడుగుపాటుకు గురై మరణించిన షేక్ పర్వీన్ కుటుంబానికి అండగా ఉంటానని, చిన్న వయసులో తల్లిని కోల్పోయిన పిల్లల్ని చూస్తే చాలా బాధ కలిగిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన షేక్ పర్వీన్ పొలంలో కూలీపనికి వెళ్లి పిడుగుపడి మృతిచెందగా, ఆమె మృతదేహానికి ప్రత్తిపాటి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడిన ప్రత్తిపాటి, ఆమె భర్త, పిల్లల్ని ఓదార్చి, ధైర్యం చెప్పారు. పిల్లల చదువులు కొనసాగించాలని, తల్లిలేని లోటు తెలియకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రత్తిపాటి పర్వీన్ భర్తకు సూచించారు. కాయకష్టంతో బతికే పర్వీన్ కుటుంబం, ఆమె మరణంతో దిక్కుతోచని స్థితిలో పడిందని ప్రత్తిపాటి ఆవేదన వ్యక్తంచేశారు. పిడుగుపడి మరణించిన వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.4లక్షల ఆర్థికసాయంతో పాటు, పర్వీన్ ఈ-శ్రమ్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకున్నందున, సంబంధిత అధికారులతో మాట్లాడి కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2లక్షలు కూడా త్వరగా మంజూరయ్యేలా చూడాలని ప్రత్తిపాటి అధికారుల్ని ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి తక్షణ సాయంగా మట్టిఖర్చులకోసం రూ.50వేలు అందించాలని ప్రత్తిపాటి జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి తోట రాజారమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, జవ్వాజి మధన్ మోహన్, గట్టినేని రమేష్, ముల్లా కరిముల్లా, వెంకట కోటయ్య, గోడ, మునఫ్, సద్దాం, గౌస్, కరీముల్లా, మస్తాన్ రావు గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.