
ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతా- మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్‌లోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు*.
ఈ సందర్భంగా మంచినీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం తదితర ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను ఆయనకు అందజేసి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
వినతులను స్వీకరించిన కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం పలువురు తమ కుటుంబ శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆయనకు అందజేసి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు…